నానికి అల్లు అర్జున్‌ బిగ్‌ షాక్‌.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌!

Pushpa Release Date Postponed Again Rumours Goes Viral - Sakshi

డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేచురల్ స్టార్ సోలోగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కాని నానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ రెడీ అవుతున్నాడని సమాచారం.ఇదే రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.డిసెంబర్ 17న రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేసుకుని పుష్పను ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాని ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నాడట.

నిజానికి మొదట డిసెంబర్ చివరి వారంలోనే పుష్ప ను రిలీజ్ చేయాలనుకున్నారు. కాని అల్లు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూవారం ముందుగానే ఈ ప్యాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు.ఇఫ్పుడు రిలీజ్ డేట్ పై యూనిట్ మరోసారి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడమే అట. అదే నిజమైతే సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న శ్యామ్ సింగ రాయ్ కు, పుష్ప బిగ్ షాక్ ఇచ్చినట్లు అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top