పుష్ప 2 ప్లేసులోకి 'ఇస్మార్ట్'.. వాయిదా పడినట్లేనా? | Pushpa 2 Postponed, Ram Double ISMART Movie Will Release On This Date | Sakshi
Sakshi News home page

Double ISMART: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన డబుల్ ఇస్మార్ట్

Jun 15 2024 4:12 PM | Updated on Jun 15 2024 4:24 PM

Pushpa 2 Postponed, Ram Double ISMART Movie Will Release On This Date

అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ మామూలుగా ఎదురుచూడట్లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇకపోతే ఇప్పటికే రిలీజైన రెండు లిరికల్ సాంగ్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. దీంతో ఆగస్టు 15 ఎప్పుడొస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే ఈ తేదీకి మూవీ రిలీజ్ కావట్లేదని, వాయిదా పడిందని గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమా కాదా అని అందరూ అనుకుంటూ ఉండగా.. మరో మూవీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)

ఆగస్టు 15న 'పుష్ప 2' రిలీజైతే.. ఆ లాంగ్ వీకెండ్ బాగా కలిసొస్తుంది. ఇదే మూవీ టీమ్ ప్లాన్. కానీ షూటింగ్ ఇంకా చాలా చేయాల్సి ఉందని, దీంతో చెప్పిన డేట్‌కి కుదరకపోవచ్చని టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉండగానే రామ్-పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ టీమ్ అదే తేదీని తమ సినిమా రిలీజ్ డేట్‌గా ప్రకటించింది. దీనిబట్టి చూస్తే 'పుష్ప 2' వాయిదా కన్ఫర్మే. లేకపోతే అంత ధైర్యంగా విడుదల తేదీ ఆగస్టు 15 అని అయితే వేయరుగా.

మరోవైపు 'ఓజీ' విషయంలోనూ ఇలానే జరిగింది. సెప్టెంబరు 27న రిలీజ్ ఉంటుందని చెప్పారు. కానీ 'దేవర' టీమ్.. ఇదే తేదీన తాము మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే 'ఓజీ' కూడా వాయిదా పడ్డట్లే. ఇకపోతే 'పుష్ప 2' ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. డిసెంబరులో ఉండొచ్చని ఓ టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి?

(ఇదీ చదవండి: హీరోయిన్ ఫేక్ వీడియో.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా)

Advertisement
 
Advertisement
Advertisement