కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్ Serial Actress Karuna Bhushan Gave Birth Twins. Sakshi
Sakshi News home page

Karuna Bhushan: రెండోసారి తల్లయిన సీరియల్ నటి

Published Sat, Jun 15 2024 3:03 PM | Last Updated on Sat, Jun 15 2024 4:01 PM

Serial Actress Karuna Bhushan Gave Birth Twins

తెలుగు సీరియల్ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఈమెకు పదేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది మళ్లీ చాన్నాళ్ల తర్వాత కరుణ్ భూషణ్ ట్విన్స్‌కి తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్-సాయిధరమ్ తేజ్ వివాదంపై స్పందించిన నిహారిక)

'ఆహా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'శంకర్ దాదా ఎంబీబీఎస్', కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు తెలుగులో బోలెడన్ని సీరియల్స్ చేసింది.

ముఖ్యంగా 'అభిషేకం' సీరియల్‌లో కరుణ అభినయానికి అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'వైదేహి పరిణయం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని కనేంత వరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement