పుష్ప 2 రికార్డు.. సంధ్య థియేటర్‌లో ఎంత రాబట్టిందంటే? | Pushpa 2 Movie: Highest Ever Gross in Single Screen Sandhya Theatre | Sakshi
Sakshi News home page

పుష్ప 2 రికార్డుల రప్పా రప్పా.. సింగిల్‌ స్క్రీన్‌లో అత్యధిక కలెక్షన్స్‌..

Jan 25 2025 7:06 PM | Updated on Jan 25 2025 8:23 PM

Pushpa 2 Movie: Highest Ever Gross in Single Screen Sandhya Theatre

పుష్ప అంటే బ్రాండ్‌ అని మరోసారి రుజువైంది. ఇప్పటికే రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్పరాజ్‌ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. సింగిల్‌ స్క్రీన్‌లో అత్యధిక గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ఒక సింగిల్‌ స్క్రీన్‌లో అత్యధిక కలెక్షన్స్‌ (గ్రాస్‌) రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచిందని ట్వీట్‌ చేసింది. 

పుష్ప 2 రికార్డు
హైదరాబాద్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం స్క్రీన్‌లో 'పుష్ప రూల్‌' ఆల్‌టైం రికార్డ్‌ అందుకుందని తెలిపింది. 51 రోజుల్లో ఒక కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయలు వసూలు చేసిందని పేర్కొంది. సంధ్య థియేటర్‌లో 206 షోలకు గానూ 1,04,580 మంది చూశారని తెలిపింది. ఇకపోతే నైజాంలో పుష్ప 2 సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేశారు.

సినిమా
పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే చైనాలోనూ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

 చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!

Advertisement
 
Advertisement
Advertisement