
చార్మి, హర్షవర్ధన్ రామేశ్వర్, పూరి జగన్నాథ్
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డుగ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ‘పూరిసేతుపతి’కి సంగీతం అందించనున్నారని మేకర్స్ ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ హర్షవర్ధన్‌తో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పూరిసేతుపతి’. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కలగలిసిన న్యూ జనరేషన్ మ్యూజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రధాన నటీనటులు పాల్గొనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం అవుతుంది.
ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సీఈఓ: విష్ణు రెడ్డి.