పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ | Puri Jagannadh Movie With Vijay Sethupathi Official Latest | Sakshi
Sakshi News home page

Puri -Vijay Sethupathi: మొత్తానికి మరో హీరోని పట్టిన పూరీ

Mar 30 2025 3:40 PM | Updated on Mar 30 2025 4:00 PM

Puri Jagannadh Movie With Vijay Sethupathi Official Latest

పూరీ జగన్నాథ్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్. కానీ రానురాను తన సినిమాలతో తానే డౌన్ ఫాల్ అవుతూ వచ్చాడు. ఇప్పటికీ పూరీ.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తే చూడాలనేది చాలామంది ఫ్యాన్స్ కోరిక. అలాంటిది వరస ఫ్లాప్స్ తర్వాత అదిరిపోయే హీరోని పట్టి, సినిమాని సెట్ చేశాడు.

(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)

గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నట్లే తమిళ హీరో విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఛార్మితో నిర్మిస్తున్నాడు కూడా. జూన్ షూటింగ్ మొదలవుతుందని, ఐదు భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నామని ఉగాది సందర్భంగా ఫొటో రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు.

ఈ ప్రకటనతో కొన్ని విషయాల్లో పూరీ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఛార్మితో విడిపోతారనే రూమర్స్ కొన్నిరోజుల క్రితం వచ్చాయి. కానీ ఇప్పుడు వాటికి చెక్ పెట్టారు. అలానే లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్స్ వల్ల చాలామంది బయ్యర్లు.. పూరీ తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మరి నిర్మాతగా మూవీస్ చేయడేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు సేతుపతి మూవీని కూడా పూరీ-ఛార్మినే నిర్మిస్తూ ఆయా పుకార్లకు చెక్ పెట్టినట్లయింది.

(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజ్ కి ముందే పైరసీ.. పాపం 'సికందర్')

Advertisement
 
Advertisement
Advertisement