ప్రేయసిని పెళ్లాడిన కొరియోగ్రాఫర్‌ | Punit Pathak Got Married To Nidhi Moony Singh Beautiful Pics | Sakshi
Sakshi News home page

వైభవంగా కొరియోగ్రాఫర్‌ పెళ్లి

Dec 12 2020 2:48 PM | Updated on Dec 12 2020 5:27 PM

Punit Pathak Got Married To Nidhi Moony Singh Beautiful Pics - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు పునీత్‌ పాఠక్‌ ఓ ఇంటి వాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు నిధి మూనీ సింగ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా శుక్రవారం వీరి వివాహం జరిగింది. వరుడు పునీత్‌ పీచ్‌ కలర్‌ శేర్వాణీ ధరించగా.. వధువు నిధి గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోయారు. లోనావాలాలో జరిగిన ఈ వేడుకకు కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌- హర్ష్‌ లింబాచియా దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. (చదవండి: విరుష్క బంధానికి మూడేళ్లు.. జీవితాంతం తోడుగా)

ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారతీ సింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పునీత్‌- నిధిలకు ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. ఇక డాన్స్‌ ఇండియా డాన్స్‌ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చిన పునీత్‌ పాఠక్‌.. ఆ తర్వాత అదే షోకు సంబంధించిన ఐదో సీజన్‌లో షోకు జడ్జిగా వ్యవహరించాడు. ఖత్రోంకీ ఖిలాడీ షో విన్నర్‌గా నిలిచిన అతడు.. ఏబీసీడీ సినిమాతో నటుడిగా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏబీసీడీ2, నవాబ్‌జాదే, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ వంటి సినిమాల్లో నటించాడు. (చదవండి: రియా కోసం తెగ బాధపడిపోతున్నాడు.. కానీ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement