PSPK Rana Movie: Title And First Look Reveals On August 15 - Sakshi
Sakshi News home page

పవన్‌, రానా మూవీ.. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడంటే

Aug 13 2021 5:39 PM | Updated on Aug 13 2021 6:12 PM

PSPK Rana Movie: Title And First Look Reveals On August 15 - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గబాటి కలిసి మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ అందించింది చిత్ర యూనిట్‌. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న ఉదయం 9.45గంటలకు ఈ చిత్ర టైటిల్‌, పవన్‌ కల్యాణ్‌ పాత్రకి సంబంధించి గింప్స్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌... భీమ్లానాయక్‌గా కనిపించనున్నారు. నిత్య మీనన్‌, ఐశ్యర్య రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement