డ్రగ్స్ కేసు అప్డేట్.. నిర్మాత కేపీ చౌదరిని..!? | Producer KP Chowdary Case Latest Update | Sakshi
Sakshi News home page

KP Chowdary Drugs Case: డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి కస్టడీ పూర్తి!

Jun 23 2023 11:55 AM | Updated on Jun 23 2023 11:55 AM

Producer KP Chowdary Case Latest Update - Sakshi

డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరీ కస్టడీ పూర్తయింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. రంగారెడ్డి కోర్టులో శుక్రవారం హాజరు పరచునున్నారు. కొన్నిరోజుల ముందు అంటే జూన్ 14న డ్రగ్స్ కేసులో 'కబాలి' ఫేమ్ నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు.

విచారణలో భాగంగా డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రీయల్ డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్ లతో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. గోవా, హైదరాబాద్ పార్టీలో పాల్గొన్న వారి వివరాలు కస్టడీలో ఉన్న నిర్మాత దగ్గర నుంచి సేకరించారు.

పలువురు సినీ తారలతో డ్రగ్స్ లింకులపై పోలీసులు ఆరా తీయడంతో పాటు డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలపైనా కేపీ చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. మొబైల్ కాల్ డేటా, వాట‍్సాప్ చాటింగ్ లాంటివి ఇతడి ముందుంచి మరీ ప్రశ్నించారు. ఇది పూర్తయిన తర్వాత కేపీ చౌదరి కార్లు అన్నింటినీ సీజ్ చేశారు.

(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement