గుడ్‌న్యూస్‌ చెప్పిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. | Priyanka Jain, Shivakumar Shares Good News After Bigg Boss Telugu 7 | Sakshi
Sakshi News home page

Priyanka Jain: నటుడితో లవ్‌ జర్నీ.. శుభవార్త చెప్పిన ప్రియాంక.. శోభా కూడా త్వరలోనే!

Dec 26 2023 5:42 PM | Updated on Dec 26 2023 6:09 PM

Priyanka Jain, Shivakumar Shares Good News After Bigg Boss Telugu 7 - Sakshi

బిగ్‌బాస్‌ 7లో టాప్‌ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌డేట్‌ ఇచ్చింది. అలాగే శోభా పెళ్లి..

తెలుగు బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. గత కొన్నేళ్లుగా నటుడు శివకుమార్‌తో ప్రేమలో మునిగి తేలుతోందీ నటి. ఇటీవల బిగ్‌బాస్‌ హౌస్‌లో తాను శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు, అతడు హౌస్‌లోకి రాగానే పెళ్లెప్పుడు చేసుకుందాం.. బిగ్‌బాస్‌ అయిపోగానే భార్యాభర్తలుగా కొత్త జర్నీ మొదలుపెడదాం అంటూ ఎమోషనలైంది.

అప్పుడే పెళ్లి
అటు శివకుమార్‌ సైతం.. ప్రియురాలిని ముద్దులతో ముంచెత్తి ఆప్యాయంగా హత్తుకున్నాడు. బిగ్‌బాస్‌ 7లో టాప్‌ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌డేట్‌ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మూహూర్తం ఫిక్స్‌ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్‌ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని, అవన్నీ మరో వీడియోలో చెప్తానంది.

శోభా పెళ్లి కూడా అప్పుడే!
ఇకపోతే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా తన జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక.. తన హెయిర్‌ ఇంకాస్త పొడుగ్గా అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంది. పనిలో పనిగా మరో సీక్రెట్‌ కూడా బయటపెట్టింది. తన బెస్ట్‌ ఫ్రెండ్‌, బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ శోభా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సీక్రెట్‌ రివీల్‌ చేసింది. దీంతో అభిమానులు వీరిద్దరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: నాకోసం ఎవరూ ముందుకు రాలే.. దుస్తులు కొనుక్కునే స్థోమత లేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement