సినిమాల‌తో బిజీ.. కుటుంబాన్నే ప‌ట్టించుకోలేదు: స్టార్ హీరోయిన్‌ | Priyanka Chopra Says She Skipped Coming Home On Many Diwalis For Work: It Was Okay Till My Dad Died - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: ఎంత పిచ్చిప‌ని చేశానో నాన్న చ‌నిపోయాక‌ గానీ తెలిసి రాలేదు

Published Sun, Nov 5 2023 7:46 PM | Last Updated on Mon, Nov 6 2023 9:33 AM

Priyanka Chopra says she Skipped Many Diwalis: It was okay Till My Dad Died - Sakshi

సెల‌బ్రిటీ స్టేట‌స్ అంత ఈజీగా వ‌చ్చేది కాదు. దానికోసం తార‌లు ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. ప‌గ‌లూ రాత్రి తేడా లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటారు. కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్ల‌కుండా సెట్స్‌లోనే ఉండిపోతారు. మ‌రికొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఎక్క‌డో షూటింగ్‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. వ‌రుస‌పెట్టి ప్రాజెక్టుల‌కు సైన్ చేసిన‌వారైతే గ‌డియారంతో పోటీ ప‌డుతూ మ‌రీ ప‌ని చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కుటుంబంతో క‌లిసి మ‌న‌సారా మాట్లాడే స‌మ‌యాన్ని కోల్పోతారు.

ఎన్ని మిస్స‌య్యానో నాకే గుర్తులేదు
తాను కూడా ఒకానొక స‌మ‌యంలో సినిమాల గురించే ఆలోచిస్తూ ఫ్యామిలీని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశానంటోంది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తాజా ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ పుట్టిన‌రోజులు నేను ఎన్ని మిస్స‌య్యానో నాకే గుర్తులేదు. ఎన్నిసార్లు త‌న‌కు ఫోన్ చేయ‌కుండా ఊరుకున్నానో లెక్కే లేదు. ఎన్నిసార్లు దీపావ‌ళి పండ‌గ‌ను మిస్స‌య్యానో నాకే తెలియ‌దు. ఎందుకంటే అప్పుడు నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉండేదాన్ని. ఎప్పుడూ సినిమా సినిమా అంటూ వీట‌న్నింటినీ లైట్ తీసుకుంటూ పోయాను.

జీవితం చాలా చిన్న‌ది
కానీ మా నాన్న చ‌నిపోయాక నాకు అన్నీ అర్థ‌మ‌య్యాయి. త‌న‌తో క‌లిసి ఎన్న‌టికీ దీపావ‌ళి పండుగ జ‌రుపుకోలేన‌ని బాధ‌ప‌డ్డాను. నాన్న అనారోగ్యానికి గురైన‌ప్పుడే నాలో చ‌ల‌నం మొద‌లైంది. జీవితం చాలా చిన్న‌ది.. మ‌నం పెద్ద పెద్ద విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టి చిన్న‌చిన్న‌వాటి కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాం, కంగారుప‌డుతుంటాం. మ‌న‌కు నిజంగా ఏది ముఖ్య‌మో వాటి గురించి ఆలోచిస్తే జీవితం ఎంతో బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా క్యాన్స‌ర్‌తో పోరాడుతూ 2013లో ప్రాణాలు విడిచారు.

చ‌ద‌వండి: ప్రియుడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement