కించ పర్చాలని, కిందకు తొక్కాలని చూస్తున్నారు : ప్రియదర్శి | Priyadarshi Talk About Mithra Mandali Movie | Sakshi
Sakshi News home page

సొంత పేరు కూడా పెట్టుకోరు..వారిని ఏం అనగలం? : ప్రియదర్శి

Oct 15 2025 5:54 PM | Updated on Oct 15 2025 6:09 PM

Priyadarshi Talk About Mithra Mandali Movie

‘విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించ పర్చాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ‘మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. అలా టార్గెటెడ్ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేసే వాళ్లు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనుల్ని చేసే వారిని మనం ఏం చేయగలం’అని అసహనం వ్యక్తం చేశారు హీరో ప్రియదర్శి.  ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్రమండలి’.విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌,సత్య, విష్ణు, రాగ్‌ మయూర్‌ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గానే అనిపించింది. అందుకే నేను ‘మిత్ర మండలి’కి ఓకే చెప్పాను. నేను విన్నప్పుడు ఏం అనుకున్నానో.. తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.

అనుదీప్ ‘జాతి రత్నాలు’ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెబుతుంటారు. మిత్రమండలి చిత్రంలో కుల వ్యవస్థ మీద విజయేందర్ మంచి సెటైరికల్‌ సీన్లు రాసుకున్నారు. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను.

‘మిత్ర మండలి’లో ఎవ్వరినీ ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి చాలా సెటైరికల్‌గా తీశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. ఇది మమ్మల్నే అన్నట్టు ఉందే? అని అనిపిస్తే మాత్రం మేం ఏమీ చేయలేం (నవ్వుతూ). ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.

‘జాతి రత్నాలు’, ‘మిత్ర మండలి’ ఒకేలా ఉండవు. ‘జాతి రత్నాలు’ తరువాత ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఎప్పుడూ ఒకే రకమైన జానర్ చిత్రాల్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండవు. ‘జాతి రత్నాలు’ టైపులో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను.

మిత్ర మండలి’ మీద నాకున్న నమ్మకంతోనే ‘ఈ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ మూవీని చూడకండి’ అని అన్నాను. నాని అన్నకి ‘కోర్ట్’ మీద ఉన్న నమ్మకంతో ఈవెంట్‌లో అలా చెప్పారు. నాక్కూడా నా ‘మిత్ర మండలి’ మీద అంతే ప్రేమ, నమ్మకం ఉంది. అందుకే అలా అన్నాను. అంతే కానీ మిగతా చిత్రాల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు.

అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ అవతలి వాళ్లని తక్కువ చేసి కామెడీ చేయడమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతోన్నప్పుడు అలాంటి నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు. కొన్ని కొందరికి వర్కౌట్ అవుతుంది.. ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు.

ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ‘ప్రేమంటే’ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement