breaking news
Niharika NM
-
‘మిత్రమండలి’ మూవీ రివ్యూ
టైటిల్ : మిత్రమండలినటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులునిర్మాణ సంస్థ: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలదర్శకుడు: విజయేందర్సంగీతం : ఆర్. ఆర్ ధ్రువన్సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్జెవిడుదల తేది: అక్టోబర్ 16, 2025మిత్రమండలి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చారు. ఓ జాతిరత్నం ప్రియదర్శి ఇందులో హీరోగా నటించడం.. స్టార్ కమెడియన్స్ అంతా ఇతర పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు అయితే పెరిగాయి. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీ వాసు చేసిన కామెంట్స్.. ‘ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడకండి’అంటూ నాని రేంజ్లో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ ‘మిత్రమండలి’పై హైప్‌ని క్రియేట్ చేశాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం(Mithra Mandali Movie Review).కథేంటంటే...జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్(సత్య) ద్వారా స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..కామెడీ చిత్రాలకు కథతో సంబంధం లేదు. నవ్వులు పూయించే సన్నివేశాలు ఉంటే చాలు, ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇక కథతో కూడిన కామెడీ ఉంటే.. ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారు. జంద్యాల, ఈవీవీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. కథలో కొత్తదనం లేకున్నా.. కామెడీ పండించినా..ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి ఉదాహారణ ‘జాతిరత్నాలు’. ఈ రెండూ లేని కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’. చెప్పుకోవడానికి పెద్ద కథ లేదు.. నవ్వుకోవడానికి కామెడీ సన్నివేశాలు లేవు. కానీ ‘స్టార్’ కమెడియన్స్ అంతా ఈ చిత్రంలో ఉన్నారు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చూసుకున్న ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. కామెడీ చిత్రం కదా ఆ కొత్తదనం ఆశించడం తప్పే అవుతుంది. కానీ కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలు అయినా నవ్వులు పూయించే విధంగా ఉండాలి కదా? అది లేదు. ఒక ఫిక్షనల్ సిటీ.. కులపిచ్చి గల రాజకీయ నేత.. ఇంట్లో అమ్మాయి పారిపోవడం.. దాని వెనుక నలుగురు కుర్రాళ్లు ఉండడం.. ఈ సింపుల్ కథతో కావాల్సినంత కామెడీ పుట్టించొచ్చు. దర్శకుడు పేపర్‌పై రాసుకున్నప్పుడు కూడా ఇలాగే ఊహించొచ్చు. కానీ ఆయన ఊహకి తెర రూపం ఇవ్వడంలో మాత్రం విఫలం అయ్యాడు. కామెడీ అనుకొని రాసుకున్న సన్నివేశాలేవి నవ్వించలేకపోయాయి. ప్రధాన పాత్రలు చెప్పే డైలాగ్స్.. వారి ప్రవర్తన..ప్రతీదీ అతిగానే అనిపిస్తుంది. కులపిచ్చి ఉన్న నారాయణ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నం.. కూతురు పారిపోవడం.. నలుగురు మిత్రుల గ్యాంగ్ చేసే అల్లరి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సత్య చేసే కామెడీ ఒకటే కాస్త నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త బెటర్. ఛేజింగ్ సీన్, పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా మిత్రమండలి చేసే కామెడీ కాస్త నవ్వులు పూయిస్తే.. చాలా చోట్ల అతిగానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి, రాగ్ మయూరి, విష్ణు, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్..వీళ్ల కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో కామెడీ పండించగలరు. కానీ ఈ చిత్రంలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం దర్శకుడు అనే చెప్పాలి. వీరి కామెడీ టైమింగ్‌ని వాడుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు. ఉన్నంతలో సత్య ఒక్కడే కాస్త నవ్వించాడు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసే కామెడీ వర్కౌట్ అయింది. మిగతా పాత్రలన్నీ అతి చేసినట్లుగానే అనిపిస్తుంది. స్వేచ్ఛగా నిహారిక తన పరిధిమేర నటించింది. సాంకేతికంగా సినిమా ఓకే. ఆర్. ఆర్ ధ్రువన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిబ్బా నిబ్బి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కించ పర్చాలని, కిందకు తొక్కాలని చూస్తున్నారు : ప్రియదర్శి
‘విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించ పర్చాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ‘మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. అలా టార్గెటెడ్ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేసే వాళ్లు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనుల్ని చేసే వారిని మనం ఏం చేయగలం’అని అసహనం వ్యక్తం చేశారు హీరో ప్రియదర్శి. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్రమండలి’.విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఆద్యంతం ఎంటర్టైనింగ్గానే అనిపించింది. అందుకే నేను ‘మిత్ర మండలి’కి ఓకే చెప్పాను. నేను విన్నప్పుడు ఏం అనుకున్నానో.. తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.→ అనుదీప్ ‘జాతి రత్నాలు’ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెబుతుంటారు. మిత్రమండలి చిత్రంలో కుల వ్యవస్థ మీద విజయేందర్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను.→ ‘మిత్ర మండలి’లో ఎవ్వరినీ ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి చాలా సెటైరికల్‌గా తీశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. ఇది మమ్మల్నే అన్నట్టు ఉందే? అని అనిపిస్తే మాత్రం మేం ఏమీ చేయలేం (నవ్వుతూ). ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.→ ‘జాతి రత్నాలు’, ‘మిత్ర మండలి’ ఒకేలా ఉండవు. ‘జాతి రత్నాలు’ తరువాత ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఎప్పుడూ ఒకే రకమైన జానర్ చిత్రాల్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండవు. ‘జాతి రత్నాలు’ టైపులో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను.→ ‘మిత్ర మండలి’ మీద నాకున్న నమ్మకంతోనే ‘ఈ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ మూవీని చూడకండి’ అని అన్నాను. నాని అన్నకి ‘కోర్ట్’ మీద ఉన్న నమ్మకంతో ఈవెంట్లో అలా చెప్పారు. నాక్కూడా నా ‘మిత్ర మండలి’ మీద అంతే ప్రేమ, నమ్మకం ఉంది. అందుకే అలా అన్నాను. అంతే కానీ మిగతా చిత్రాల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు.→ అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ అవతలి వాళ్లని తక్కువ చేసి కామెడీ చేయడమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతోన్నప్పుడు అలాంటి నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు. కొన్ని కొందరికి వర్కౌట్ అవుతుంది.. ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు.→ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ‘ప్రేమంటే’ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే జరుగుతుంది. -
అందుకే ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు : ‘మిత్రమండలి’ నిర్మాతలు
‘మిత్ర మండలి’ అనేది బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. కానీ ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. కళ్యాణ్ ఎక్కువగా వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మేం ఇద్దరం ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్‌గా ఉంటుంది.→ విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్‌లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్‌తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.→ ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందం గారితో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్‌ను ఎంజాయ్ చేశారు.→ ఈ సినిమా కోసం ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్‌తో పాటు ఫిక్షనల్ క్యాస్ట్‌ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫిక్షనల్ క్యాస్ట్‌తో సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్‌గా సీన్లను చిత్రీకరించాం. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది.→ మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం. -
నా సీన్ చూసి ఇంట్లో వాళ్లు కళ్లు మూసుకోవద్దు : హీరోయిన్
ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు. అదే నేను పెట్టుకున్న కండీషన్’ అని అన్నారు హీరోయిన్ నిహారిక ఎన్ ఎం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నిహారిక..‘మిత్ర మండలి’తో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘పెరుసు’(నిహారిక నటించిన తొలి తమిళ చిత్రం) కంటే ముందే ‘మిత్ర మండలి’ కథ విన్నాను. కానీ ‘పెరుసు’ ముందు రిలీజ్ అయింది. ‘మిత్ర మండలి’లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి అక్టోబర్ 16న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.→ ఈ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది.→ ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు.→ నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసుకుంటాను కదా (నవ్వుతూ).→ నేను పరాజయాలకు ఇట్టే కృంగిపోతాను.. ఫెయిల్యూర్స్ వస్తే చాలా బాధపడతాను. అయితే వెంటనే దాన్నుంచి బయటకు వచ్చేస్తాను.→ తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు. -
'బ్రహ్మానందం' పాపులర్ డైలాగ్‌తో సాంగ్.. చూశారా?
ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) కలిసి నటిస్తోన్న కొత్త చిత్రం ‘మిత్ర మండలి’. కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు విజయేందర్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను విడుదల చేశారు. 'జంబర్ గింబర్ లాలా' లిరిక్స్‌తో ఉన్న ఈ సాంగ్ అందరినీ మెప్పించేలా ఉంది. శ్రీనువైట్ల తెరకెక్కించిన 'వెంకీ' సినిమాలో గజాలా పాత్రలో బ్రహ్మానందం తన కామెడీతో అదరగొట్టారు. ఆ మూవీలో 'జంబర్ గింబర్ లాలా' అంటూ బ్రహ్మీ పాడే సాంగ్ ఇప్పటికీ సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఇదే లైన్‌తో ఏకంగా సాంగ్ లో వాడారు.హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. -
సోషల్ మీడియా టూ సిల్వర్ స్క్రీన్.. ట్రెండీ బ్యూటీ నిహారిక (ఫొటోలు)
-
ఆ హీరోయిన్ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు.
సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎమ్ (Niharika NM) టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మ్యాడ్ ఫేమ్ విష్ణు, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం (జూన్ 12న) మిత్రమండలి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వించేలా ఉంది.నేను వయసులో చిన్నవాడినే..అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్గా సెలక్ట్ చేసిన అల్లు అరవింద్ (Allu Aravind)కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్ స్టేజీ ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్‌గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్ జెనరేషన్‌తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలక్ట్ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది.కథ తెలీకుండా సినిమా చూడబోతున్నాఈ సినిమా డైరెక్టర్ విజయేందర్ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట.. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్‌గా నావల్ల కావడం లేదు సర్, నేనెళ్లిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే.. మీ రేంజ్ వేరు, నా వల్ల కావట్లేదు.. మళ్లీ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వస్తాను సర్ అని చెప్పి వెళ్లిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను.ఫేక్ ఐడీతో ఫాలో కొట్టా..అయితే వాసు.. ఈ సినిమా కోసం ఐదారుగురు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు? చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చూశాం అని చెప్పాను. ఇన్‌స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది. మా ఒరిజినల్ ఐడీతో సోషల్ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా.. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక.. పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా


