నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేదు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అయితే, ఈ మూవీకి సమర్పకులుగా నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు.
మిత్రమండలి(Mithra Mandali) సినిమా నవంబర్ 6న ఓటీటీ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

కథేంటంటే...
జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్‌ఎమ్) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు.
అయితే, స్వేచ్ఛ పారిపోవడం వెనక ఆ ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali) చూడాల్సిందే.


