అందుకే ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు : ‘మిత్రమండలి’ నిర్మాతలు | Mithra Mandali Movie Releasing on Oct 16 – Priyadarshi, Niharika NM Lead Roles | Sakshi
Sakshi News home page

అందుకే ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు : ‘మిత్రమండలి’ నిర్మాతలు

Oct 10 2025 5:36 PM | Updated on Oct 10 2025 6:08 PM

Producers Kalyan Manthina And Bhanu Pratapa Talk About Mitra Mandali Movie

‘మిత్ర మండలి’ అనేది బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. కానీ ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రంమిత్ర మండలి’. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. కళ్యాణ్ ఎక్కువగా వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మేం ఇద్దరం ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్‌గా ఉంటుంది.

విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్‌లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్‌తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందం గారితో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్‌ను ఎంజాయ్ చేశారు.

ఈ సినిమా కోసం ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్‌తో పాటు ఫిక్షనల్‌ క్యాస్ట్‌ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్‌లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫిక్షనల్ క్యాస్ట్‌తో సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్‌గా సీన్లను చిత్రీకరించాం. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది.

మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్‌తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement