
ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్‌ఎమ్ (Niharika NM) కలిసి నటిస్తోన్న కొత్త చిత్రం ‘మిత్ర మండలి’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు విజయేందర్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను విడుదల చేశారు. 'జంబర్ గింబర్ లాలా' లిరిక్స్‌తో ఉన్న ఈ సాంగ్ అందరినీ మెప్పించేలా ఉంది. శ్రీనువైట్ల తెరకెక్కించిన 'వెంకీ' సినిమాలో గజాలా పాత్రలో బ్రహ్మానందం తన కామెడీతో అదరగొట్టారు. ఆ మూవీలో 'జంబర్ గింబర్ లాలా' అంటూ బ్రహ్మీ పాడే సాంగ్ ఇప్పటికీ సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఇదే లైన్‌తో ఏకంగా సాంగ్ లో వాడారు.
హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.