
ప్రియదర్శి పులికొండ, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అప్పట్లో ఓవర్సీస్లోనూ వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన చిత్రంగా ఘనత సాధించింది.
తాజాగా ప్రియదర్శి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిత్రమండలి సినిమాతో మరోసారి జాతిరత్నాల్లాంటి ఎంటర్టైన్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ట్రైలర్ విడుదల చేయగా విపరీతంగా నవ్వులు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి జాతిరత్నాలు సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆ టైమ్లో వచ్చిన జాతి రత్నాలు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యిందని ప్రియదర్శి అన్నారు. జాతిరత్నాలు సినిమాకు, మిత్రమండలికి చాలా వేరియషన్ ఉంటుందన్నారు. ఒకవేళ ఇప్పుడు కనుగ జాతిరత్నాలు-2 తీస్తే నేను మాత్రం అస్సలు చేయనని ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి క్లాసిక్ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ.. నేను మాత్రం నటించనని స్పష్టం చేశారు.
కాగా.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శితో పాటు విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిత్రమండలి అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది.