
ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, పద్మ విభూషణ్ ఛన్నులాల్ మిశ్రా (chhannulal mishra) అనారోగ్యంతో మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఛన్నులాల్ మరణం తనను బాధించిందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందంటూ సంతాపం తెలిపారు.
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఎలనలేని గుర్తింపు పొందిన ఛన్నులాల్ ఉత్తరప్రదేశ్‌లో 1936లో జన్మించారు. భారతీయ కళ, సంస్కృతి కోసం ఆయన చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ (2010), పద్మ విభూషణ్ (2020)తో గౌరవించింది.