Prabhas Staying Some Days In Foreign - Sakshi
Sakshi News home page

మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్న ప్రభాస్‌

Jul 17 2023 6:02 AM | Updated on Jul 17 2023 4:39 PM

Prabhas stayiing some days in Foreign - Sakshi

దాదాపు ముప్పై రోజులుగా ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్నారు ప్రభాస్‌. ఈ ట్రిప్‌ ఇప్పటికే పూర్తి కావాల్సిందట.. కానీ మరికొన్ని రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశాపటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌  ఇది. ఈ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ 2023’ వేడుకలో లాంచ్‌ చేస్తారు.

ఈ నెల 20న (భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21) జరగనున్న ఈ వేడుక కోసం ప్రభాస్‌ మరికొన్ని రోజులు అమెరికాలోనే ఉండి, ఆ తర్వాత ఇండియాకి తిరిగొస్తారట. అనంతరం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. కాగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్‌’(ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే సినిమాకి ప్రభాస్‌ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement