జైలులో స్పిరిట్‌ | Prabhas Spirit Shoots at Chanchalguda Central Jail | Sakshi
Sakshi News home page

జైలులో స్పిరిట్‌

Jun 23 2026 12:12 AM | Updated on Jun 23 2026 12:12 AM

Prabhas Spirit Shoots at Chanchalguda Central Jail

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్‌’. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్‌ ఒబెరాయ్, ఐశ్వర్యాదేశాయ్, కాంచన, ప్రకాష్‌రాజ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం కోసం తొలిసారి ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో జరుగుతోంది. ఈ మూవీకి ఎంతో కీలకమైన జైలు సన్నివేశాలను ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్నారు సందీప్‌ అండ్‌ టీమ్‌.

‘స్పిరిట్‌’ కోసం మేజర్‌ చిత్రీకరణ రియల్‌ లొకేషన్స్ లో చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ సినిమాకు హర్షవర్ధన్  రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘ఫౌజి’ సినిమా చిత్రీకరణలోనూ ప్రభాస్‌ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబరులో ‘ఫౌజి’ మూవీ రిలీజ్‌ కానుందని తెలిసింది. ‘స్పిరిట్‌’, ‘ఫౌజి’ సినిమాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాగ్‌ అశ్విన్  డైరెక్షన్ లో ‘కల్కి 2’ షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొంటారు.    కాగా ‘కాంతార, సలార్‌’ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థతో ప్రభాస్‌ మూడు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement