Prabhas Next Movie Under Prithviraj Sukumaran Direction? - Sakshi
Sakshi News home page

Prabhas: మరో యాక్షన్ మూవీ.. 'సలార్'ని మించిపోయేలా?

Jul 26 2023 10:20 AM | Updated on Jul 26 2023 10:34 AM

Prabhas Movie With Prithviraj Sukumaran Direction - Sakshi

ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' లాంటివి చేసినా యాక్షన్ సినిమాలు చేయాలని గట్టిగా అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి కటౌట్‌కి.. ఓ మూడు నాలుగు ఫైట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ పడితే థియేటర్లు తగలబడిపోతాయి. త్వరలో 'సలార్'తో ఇదే జరగబోతుందని ఫ్యాన్స్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. అయితే అభిమానుల కోసం డార్లింగ్ హీరో మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)

'బాహుబలి' తర్వాత 'సాహో' అనే యాక్షన్ మూవీ చేశాడు గానీ ఎందుకో అది ఫ్యాన్స్‌కి సంతృప్తి ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత 'రాధేశ‍్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు చేశాడు. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. దీంతో అందరి చూపు 'సలార్'పై పడింది. సెప్టెంబరు 28న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలోకి రానుంది. మొన్న టీజర్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

'సలార్'లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేస్తున్నాడు. అయితే పృథ్వీరాజ్.. హీరో కమ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. అలానే వీలు దొరికినప్పుడు డైరెక్టర్‌గానూ మారుతున్నాడు. ఇప్పుడు అలా తనలోని దర్శకుడికి పనిచెప్పి, ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేశాడట. దాన్ని ప్రభాస్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది గనుక ఓకే అయితే మాత్రం మరో 'సలార్' అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!)

Advertisement
 
Advertisement
Advertisement