రీ రిలీజ్‌లోనూ డార్లింగ్ సత్తా.. పవన్ కల్యాణ్ మూవీ రికార్డ్ బ్రేక్ | Prabhas Darling records 2nd biggest Telugu re release debut | Sakshi
Sakshi News home page

Darling Movie: రీ రిలీజ్‌లోనూ డార్లింగ్ సత్తా.. గబ్బర్‌ సింగ్ రికార్డ్ బ్రేక్

Apr 24 2026 6:44 PM | Updated on Apr 24 2026 7:05 PM

Prabhas Darling records 2nd biggest Telugu re release debut

టాలీవుడ్ కొన్ని నెలలుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీని కూడా బిగ్‌ స్క్రీన్‌పై విడుదల చేశారు. విడుదలైన 16 సంవత్సరాల తర్వాత థియేటర్లలో మళ్లీ సందడి చేసింది. 2010లో ఏప్రిల్ 23న రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు.

ఈ రొమాంటిక్ మూవీ రీ రిలీజ్‌లోనూ సత్తా చాటింది. మొదటి రోజు ఏకంగా రూ.7.59 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రీ-రిలీజ్‌ మూవీస్‌లో  మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేశ్ బాబు ఖలేజా చిత్రాల వసూళ్లను అధిగమించింది.

ఈ సినిమా కంటే ముందు 'బాహుబలి: ది ఎపిక్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ.19.65 కోట్లు వసూలు చేసింది. కాగా.. డార్లింగ్ మూవీని 4కె వర్షన్‌లో రిలీజ్ చేశారు. బాహుబలి: ది ఎపిక్  ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీ-రిలీజ్‌గా నిలిచింది. కాగా.. డార్లింగ్ మూవీకి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement