Darling Movie
-
డార్లింగ్ రీ రిలీజ్ లో రచ్చ ప్రభాస్ ఫ్యాన్ ని చితకబాదిన థియేటర్ సిబ్బంది
-
రేసుగుర్రం Vs డార్లింగ్.. రీ రిలీజ్ రికార్డులన్నీ ఔట్
-
రీ రిలీజ్లోనూ డార్లింగ్ సత్తా.. పవన్ కల్యాణ్ మూవీ రికార్డ్ బ్రేక్
టాలీవుడ్ కొన్ని నెలలుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీని కూడా బిగ్ స్క్రీన్‌పై విడుదల చేశారు. విడుదలైన 16 సంవత్సరాల తర్వాత థియేటర్లలో మళ్లీ సందడి చేసింది. 2010లో ఏప్రిల్ 23న రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు.ఈ రొమాంటిక్ మూవీ రీ రిలీజ్లోనూ సత్తా చాటింది. మొదటి రోజు ఏకంగా రూ.7.59 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రీ-రిలీజ్ మూవీస్‌లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేశ్ బాబు ఖలేజా చిత్రాల వసూళ్లను అధిగమించింది.ఈ సినిమా కంటే ముందు 'బాహుబలి: ది ఎపిక్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ.19.65 కోట్లు వసూలు చేసింది. కాగా.. డార్లింగ్ మూవీని 4కె వర్షన్లో రిలీజ్ చేశారు. బాహుబలి: ది ఎపిక్ ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీ-రిలీజ్‌గా నిలిచింది. కాగా.. డార్లింగ్ మూవీకి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో నిర్మించారు. -
డార్లింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి అనుకున్న తరుణంలో డార్లింగ్ సినిమా వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించగా నభా నటేష్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 19న విడుదలైంది.ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 13 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది చూసిన ప్రియదర్శి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డార్లింగ్ కథేంటంటే?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యను హనీమూన్‌కు పారిస్ తీసుకోవాలని కలలు కంటూనే పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయి(అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇంతలో ఆమె ప్రేమించినవాడితో పారిపోతుంది. తన పెళ్లి పెటాకులైందన్న బాధతో రాఘవ్ చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. తనతోనే ఇతడి పెళ్లి జరుగుతుంది. అసలు ఆనంది ఎవరు? అపరిచితురాలిగా ఒక్కో సమయంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఓటీటీలో డార్లింగ్ చూడాల్సిందే! Gear up for a MADMAX Marriage Entertainer 🔥💯#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/mYSJYVlH7Q— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 2, 2024 చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
ప్రియదర్శి డార్లింగ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్


