'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్.. | Prabhas Comments Salaar Movie And Director Prashanth Neel | Sakshi
Sakshi News home page

Prabhas Salaar Movie: 21 ఏళ్ల కెరీర్ లో నేను అలా తొలిసారి.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Fri, Dec 15 2023 7:59 PM | Last Updated on Fri, Dec 15 2023 8:39 PM

Prabhas Comments Salaar Movie And Director Prashanth Neel - Sakshi

'సలార్' రిలీజ్‌కి అంతా సిద్ధమైపోయింది. తిప్పితిప్పి కొడితే వారం రోజులు కూడా లేదు. ట్రైలర్, ఓ పాట తప్ప ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏం లేదు. ఇలాంటి టైంలో ప్రభాస్.. సినిమా గురించి మాట్లాడాడు. కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. మూవీ గురించి, దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పుకొచ్చాడు. 

'సలార్ మూవీలో చాలా డెప్త్ ఉన్న ఎమోషన్స్ ఉంటాయి. ఆడియెన్స్.. నన్ను ఇలాంటి పాత్రలో తొలిసారి చూడబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ నటించాను. సినిమా చేస్తున్నప్పుడే నా ఆలోచనలు కొన్నింటిని షేర్ చేసుకున్నాను. వాటిని ఎలా చూపించాలో ఆయనకు చెప్పాను. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను. అలానే నా 21 ఏళ్ల కెరీర్‌లో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్'

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ)

'ఇకపోతే సలార్ షూట్ కోసం ఎప్పుడు పిలుస్తారా అని తెగ ఎదురుచూశాను. సెట్‌కి వెళ్లి యాక్ట్ చేయడం కంటే ప్రశాంత్ నీల్ టైమ్ స్పెండ్ చేయాలని తెగ ఆత్రుతగా ఎదురుచూశాను. నా కెరీర్‌లో ఎప్పుడు ఇలా అనుకోలేదు. అలానే షూటింగ్ మొదలైన నెలలోనే ప్రశాంత్ నీల్-నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. శత్రువులుగా మారితే ఏమైంది? అనే స్టోరీతో 'సలార్' మూవీ తీశారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. డిసెంబరు 22న అంటే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దగా ప్రమోషన్స్ లాంటి హడావుడి ఏం లేకుండా 'సలార్'.. థియేటర్లలోకి వస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement