నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ | Vaishnav Tej And Sreeleela Adikeshava Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

OTT Movie: మెగాహీరో మూవీ ఓటీటీ రిలీజ్‌కి రెడీ.. స్ట్రీమింగ్ అప్పుడే?

Published Fri, Dec 15 2023 4:49 PM | Last Updated on Fri, Dec 15 2023 5:18 PM

 Adikeshava Movie OTT Release Date Confirmed Sreeleela - Sakshi

థియేటర్ల సంగతి పక్కనబెడితే ప్రతివారం ఓటీటీల్లో కొత్త మూవీస్ విడుదలవుతూనే ఉంటాయి. హిట్ అయిన మూవీస్ కాస్త లేటుగా స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి కానీ యావరేజ్, ఫ్లాప్ మూవీస్ మాత్రం దాదాపు నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ తెలుగు మూవీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయింది.

(ఇదీ చదవండి:  తెలుగు యూట్యూబర్‌, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్‌)

ఇంతకీ ఏ సినిమా?
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగాహీరో వైష్ణవ్ తేజ్-శ్రీలీల కాంబోలో తీసిన మూవీ 'ఆదికేశవ'. యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడి.. గతనెల అంటే నవంబరు 24న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ప్రేక్షకులని అలరించలేకపోయింది. రొటీన్ స్టోరీకి తోడు టేకింగ్ కూడా దెబ్బకొట్టేసింది.

ఓటీటీలో ఎప్పుడు?
నవంబరు 24న థియేటర్లలో రిలీజైన 'ఆదికేశవ'.. డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇకపోతే క్రిస్మస్ టైంలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే డిసెంబరు 22 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. సరిగ్గా అదే రోజు థియేటర్లలో ప్రభాస్ 'సలార్' రిలీజ్ అవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement