యూట్యూబర్‌, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

Chandoo Gadu: ప్రేమ పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్‌ అరెస్ట్‌

Published Fri, Dec 15 2023 2:00 PM

Youtuber, Pakkinti Kurradu Chandu Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబర్‌, నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతికి యూట్యూబర్‌ చందుసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2021 ఏప్రిల్‌ 25న బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు.

పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. అతడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

కాగా చందు అసలు పేరు  చంద్రశేఖర్ సాయి కిరణ్. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో ఫేమస్‌ అయ్యాడు. చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌లో వీడియోలు చేస్తూ డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తుంటాయి. చందుగాడు యూట్యూబ్‌ ఛానల్‌కు ఐదున్నర లక్షల పైచిలుకు సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్‌ స్వీట్‌ వార్నింగ్‌..

Advertisement
Advertisement