హైదరాబాద్‌లో మరో ఇంటిని కొనుగోలు చేయనున్న ప్రభాస్‌.. రూ. 200 కోట్లతో | Prabhas Another New Villa In Hyderabad | Sakshi
Sakshi News home page

Prabhas: హైదరాబాద్‌లో మరో ఇంటిని కొనుగోలు చేయనున్న ప్రభాస్‌.. రూ. 200 కోట్లతో

Dec 10 2021 9:13 PM | Updated on Dec 10 2021 10:15 PM

Prabhas Another New Villa In Hyderabad - Sakshi

రాధే శ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌తోపాటు.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో  ప్రాజెక్ట్ కే, సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా చేస్తున్నాడు.

బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌ అయిపోయాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. బాహుబలి తరువాత సినిమాల ఎంపికలో ప్రభాస్‌ చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్‌ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌తోపాటు.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో  ప్రాజెక్ట్ కే, సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా చేస్తున్నాడు. తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది.

ప్రభాస్‌ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. ఔటర్‌ రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌లో రూ.120 కోట్లతో రెండు ఎక‌రాలు కొన్నాడ‌ని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గర‌గా ఉంటుంద‌నీ, ట్రాఫిక్ పెద్దగా వుండ‌ని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ అక్కడ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్‌ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమాచారం.
చదవండి: సమంత ఐటమ్‌ సాంగ్‌ పాడిన సింగర్‌.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా!

కాగా నానక్‌రామ్‌గూడలో అనేక మంది స్టార్‌లతో సహా ఇతర రంగాలకు చెందిన పేరుమోసిన వ్యక్తులు నివసిస్తుంటారు. అంతేగాక షూటింగ్ జరిగే ప్రదేశాలకు చేరువలో ఉంది. ఇప్పటికే బాహుబలికి జూబ్లీహిల్స్‌లో ఓ భవంతి ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటి నుంచో ప్రైమ్ రియల్ ఎస్టేట్ కొనాలని ప్రభాస్ ఎజెండాలో ఉంది.  ఇప్పుడు కొన్న  స్థలంలో త‌నకు అనుకూలంగా నిర్మించుకోనున్నట్లు  వినికిడి.
చదవండి: విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై

Advertisement
 
Advertisement
Advertisement