నేను చనిపోలేదు, బతికే ఉన్నా: పూనమ్‌ పాండే | Poonam Pandey Says I Am Alive, Video Goes Viral - Sakshi
Sakshi News home page

బతికే ఉన్నానని ట్విస్ట్‌ ఇచ్చిన పూనమ్‌ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే?

Published Sat, Feb 3 2024 12:36 PM

Poonam Pandey Says I Am Alive - Sakshi

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించిందనే షాకింగ్ న్యూస్ శుక్రవారం నుంచి వైరల్‌ అవుతుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పీఆర్‌ టీమ్‌ షేర్ చేసిన నోట్ నిజమా కాదా అని అభిమానులు అభిప్రాయపడుతున్న సమయంలో తాజాగా ఆమె నుంచి ఒక షాకింగ్‌ మెసేజ్‌ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ పెట్టింది. తనకు ఎలాంటి క్యాన్సర్‌ లేదని పేర్కొంది. సర్వైకల్‌(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌) గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని పూనమ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియోని రిలీజ్‌ చేసింది. 

పూనమ్‌ పాండే మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆమె ఇలా వివరణ ఇచ్చింది. 'మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను.- నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. కానీ విషాదకరంగా, ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల నేడు దేశంలో ప్రాణాలను వదులుతున్నారు. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా.. సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది.

(ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి)

HPV వ్యాక్సిన్‌ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చు . ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు నేడు వ్యైద్యశాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం.' అని పూనమ్‌ పాండే తెలిపింది.

తన మరణవార్త విషయంలో అందరూ క్షమించాలని పూనమ్‌ పాండే కోరింది. మహిళలలో ఎంతో నిశ్శబ్ధంగా వ్యాపిస్తున్న గర్భాశయ క్యాన్సర్‌ గురించి అందరికీ తెలిసేలా చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని ఆమె తెలిపింది. ఫిబ్రవరి 4న వరల్డ్‌ క్యాన్సర్‌ డే కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనమ్‌ ఇలాంటి చర్యకు పాల్పడిందని చెప్పవచ్చు. దీంతో ఆమెపై సోషల్‌ మీడియా నుంచి వ్యతిరేఖత కూడా వస్తుంది. ఇంతదానికి మరణించినట్లు పోస్ట్‌ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement