
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి మట్టి కవి బెల్లి యాదయ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది’’ అన్నారు.
‘‘నేను ఆర్మీలో పని చేసి వచ్చాను. మంచి కంటెంట్ ఉన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు జనార్ధన్. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సందేశాన్ని ప్రేక్షకులకు చెబుతున్నాం. సినిమా చూశాక సమాజం మీద ఒక ప్రేమతో, బాధ్యతతో ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకి వస్తారు’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అన్నారు సన్నీ అఖిల్.