టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం | PDV Prasad Wife Anju Prasad Passed Away | Sakshi
Sakshi News home page

ప్ర‌ముఖ నిర్మాత భార్య కన్నుమూత

Nov 6 2020 6:32 PM | Updated on Nov 6 2020 8:31 PM

PDV Prasad Wife Anju Prasad Passed Away - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత పీడీవీ ప్ర‌సాద్ స‌తీమ‌ణి అంజు ప్ర‌సాద్(53) గుండెపోటుతో మ‌ర‌ణించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. పీడీవీ ప్ర‌సాద్ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. కాగా అంజు ప్ర‌సాద్ మృతి ప‌ట్ల‌ ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు నివాళులు అర్పిస్తున్నారు. కాగా పీడీవీ ప్ర‌సాద్.. ప్ర‌ముఖ‌ చ‌ల‌న‌చిత్ర‌ నిర్మాణ సంస్థ‌లు హారిక హాసిని నిర్మించే చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. (చ‌ద‌వండి: మన యుద్ధం మనమే చేయాలి..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement