టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌ | Payal Rajput Comments On movie Chance In Tollywood | Sakshi
Sakshi News home page

టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌

Apr 1 2025 1:05 PM | Updated on Apr 1 2025 1:27 PM

Payal Rajput Comments On movie Chance In Tollywood

టాలెంట్‌ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్‌ రాజ్‌పుత్‌'(Payal Rajput) అన్నారు. 'RX 100' ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి సినిమాతో  ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్‌ కొట్టింది.  ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. ఈ మూవీ త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయితే, చాలారోజుల గ్యాప్‌ తర్వాత వచ్చిన 'మంగ‌ళ‌వారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను  జైపుర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఉత్తమ నటిగా పాయల్‌ అవార్డ్‌ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్‌ ఒక పోస్ట్‌ చేసింది.

ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే  నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న  ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది.  నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్‌ ద్వారా  దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్‌ అన్నారు.

 మంగళవారం (2023) తర్వాత పాయల్‌ రాజ్‌పూత్‌ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్‌మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్‌ ట్వీట్‌ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్‌ చేస్తూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేయడం విశేషం. అలా పాయల్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement