Hari Hara Veera Mallu Teaser: Pawan Kalyan PSPK27 New Movie Title And First Look Released - Sakshi
Sakshi News home page

సర్‌ప్రైజ్‌: pspk27 టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Mar 11 2021 6:45 PM | Updated on Mar 11 2021 8:36 PM

Pawan Kalyan PSPK27 Movie Title And First Look Released On Shivaratri - Sakshi

చెప్పినట్లుగానే పవన్‌ కొత్త సినిమా ‌టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ చెప్పినట్లుగా మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసి అభిమానుల ఉత్కంఠకు తెరలెపింది.

ఇటీవల ‘వకీల్‌ సాబ్’‌ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే #PSPK27 అనే వర్కింగ్‌ టైటిల్‌తో‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ మహా శివరాత్రికి ‌టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తున్నట్లు నిన్న చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీంతో ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని అభిమానుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా చెప్పినట్లుగానే దర్శకుడు మహా శివరాత్రికి  టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ప్రేక్షకులు, అభిమానుల ఉత్కంఠకు తెరలెపాడు. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి.. ది లెజెండరీ హీరోయిక్‌ జౌట్‌లా‌ అనే ఉప శీర్షికతో పవన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

బంధిపోటు దుస్తుల్లో ఉన్న పవన్ క‌ల్యాణ్ బిల్డింగ్‌పై నుంచి నౌక‌వైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.  ఇందులో పవన్‌ వజ్రాల దొంగగా తెరపై ఆలరించనున్నట్లు సమాచారం. పీరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ. దయకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 

చదవండి: శివరాత్రికి టైటిల్
 #pspkrana షూటింగ్‌ సెట్‌.. ఫొటో లీక్‌
పవన్‌ కల్యాణ్‌ న్యూలుక్‌.. షాకవుతున్న ఫ్యాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement