PSPK Rana Movie Leaked Pics: Pawan Kalyan, Rana Daggubati Movie Shooting Pics Leaked - Sakshi
Sakshi News home page

#pspkrana షూటింగ్‌ సెట్‌.. ఫొటో లీక్‌

Mar 5 2021 12:25 PM | Updated on Mar 5 2021 1:51 PM

Pawan Kalyan Jump Into Wall In PSPKRana Movie Photos Leak - Sakshi

అభిమానుల్లో అసక్తిని పెంచేందుకు చిత్ర నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌‌‌ కానీ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అచినప్పటికి తాజాగా #pspkrana షూటింగ్‌ సెట్‌లోని పవన్ స్టార్‌కు సంబంధించిన ఓ‌‌ ఫొటో బయటకు వచ్చింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిలతో ఓ మల్టీస్టారర్‌ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం పవన్‌ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బ్రిక్స్‌ ప్లేస్‌లో #pspskrana అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే అభిమానుల్లో అసక్తిని పెంచేందుకు చిత్ర నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌‌‌ కానీ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయినప్పటికీ తాజాగా #pspkrana షూటింగ్‌ సెట్స్‌ నుంచి పవన్‌ ఫొటో బయటకు వచ్చింది. 

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన పవన్‌ అభిమానులు మురిసిపోతున్నారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ గొడపై నుంచి దూకుతున్నట్లు కనిపించాడు. అక్కడే ఆయన వెనక ఇద్దరు పోలీసులు కానిస్టేబుల్స్‌ నిలబడి ఉన్నారు. కాగా ఇటీవల ‘వకీల్‌ సాబ్‌’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న పవన్‌ ఈ మూవీతో పాటు క్రిష్‌ జాగర్లముడి డైరెక్షన్‌లో #pspk27 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న మూవీ షూటింగ్‌లో కూడా‌ పాల్గొంటూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అయితే వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ‘వకీల్‌ సాబ్’‌ త్వరలో విడుదల కానుంది. బోని కపూర్‌, దిల్‌రాజుల సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రంలో శృతీ హాసన్‌, నివేదిత థామస్‌ కథానాయికలు. ఇక రానా వేణు ఉడుగుల దర్శకత్వంలో  ‘విరాట పర్వం’లో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: రానా మరో జర్నీ బిగిన్స్‌ : కిల్లర్‌ కాంబో
            పవన్‌కు త్రివిక్రమ్‌ మాట సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement