రానా మరో జర్నీ బిగిన్స్‌ : కిల్లర్‌ కాంబో

Rana daggubati, Pawan kalyan killer combo - Sakshi

 మాచో  మ్యాన్‌తో పవర్‌స్టార్

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు, బల్లాలదేవ రానా దగ్గుబాటి తన ఫ్యాన్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి మల్టీ స్టారర్‌ మూవీని  అనౌన్స్‌  చేశారు. మరో జర్నీ ప్రారంభం అంటూ రానా ట్వీట్‌ చేశారు.  పరిశ్రమలో చాలా మంది  స్టార్స్‌తో పనిచేయడం చాలా సంతోషం. ఇపుడిక అవర్‌ ఓన్‌​ పవర్‌.. పవన్‌ కళ్యాణ్‌తో అంటూ  రానా తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను  రానా ట్విటర్‌లో షేర్‌ చేశారు. (కేజీఎఫ్‌2 సర్‌ప్రైజ్‌ : యశ్‌ బర్త్‌డే గిఫ్ట్‌)

దర్శకుడు త్రివిక్రమ్‌ కెమెరా ఆన్‌ చేసి ముహూర్తం షాట్‌ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి, 2021లో షురూ కానుంది.  సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై, సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ఎస్‌ సంగీతం అందిస్తున్నారు. తమన్‌ బీజీఎం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిల్లర్‌ కాంబో అంటూ అటు పవన్‌, ఇటు రానా అభిమానులు సోషల్‌ మీడియాలో  సందడి చేస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top