Samyuktha Menon: భీమ్లా నాయక్, బింబిసారతో క్రేజ్‌.. టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు..!

Heroine Samyuktha Menon Gets Offers In Tollywood After Bimbisara Movie - Sakshi

భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్‌లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్‌ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్‌ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. 

(చదవండి: ‘భీమ్లా నాయక్‌’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్‌ క్లారిటీ)

 ‘బింబిసార’ నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.  ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్‌ టాక్ సెంటిమెంట్‌ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.  తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో  ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top