Bheemla Nayak OTT Release Date: Pawan Kalyan Bheemla Nayak OTT Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Bheemla Nayak OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో భీమ్లా నాయక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Mar 18 2022 10:57 AM | Updated on Mar 18 2022 1:06 PM

Pawan Kalyan Bheemla Nayak Ott Release Date Confirmed - Sakshi

Bheemla Nayak OTT Release Date: పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భీమ్లా నాయక్‌'. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.


ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జోడీగా సంయుక్తా మీనన్‌ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అభిమానులకు చిత్ర బృందం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది.  గత నెల 25న విడుదలైన భీమ్లా నాయక్ సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో రిలీజ్‌ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు. కాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు భీమ్లా నాయక్‌ సైతం ఓటీటీలో విడుదల కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement