
మేయర్‌పై వ్యతిరేకత.. కూటమిలో లుకలుకలు.. హైకోర్టు కేసు నేపథ్యంలో వేటు భయం.. వెరసి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సాడి పద్మారెడ్డికి ఘన విజయం కట్టబెట్టాయి.

జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలో విజయం సాధించిన అనంతరం కేకే రాజును ఎత్తుకుని హర్షం వ్యక్తం చేస్తున్న కార్పొరేటర్లు నాయకులు,కార్యకర్తలు.

వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాడి పద్మారెడ్డి విజయం అనంతరం అభినందనలు తెలుపుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, కార్పొరేటర్లు, పార్టీ యకులు.

జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సాడి పద్మారెడ్డి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బొత్సను కలిసిన వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, కరణం ధర్మశ్రీ, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు.

ఓటేస్తున్న పీలా శ్రీనివాస్

గొలగాని హరివెంకట కుమారి

బాణాల శ్రీనివాస్

కటుమూరి సతీష్







