ఆకట్టుకుంటున్న 'మరువ తరమా' ఫస్ట్‌ సాంగ్‌ | Padham Parugulu Song From Maruva Tarama Launched | Sakshi
Sakshi News home page

Maruva Tarama : ఆకట్టుకుంటున్న 'మరువ తరమా' ఫస్ట్‌ సాంగ్‌

May 8 2023 6:51 PM | Updated on May 8 2023 7:23 PM

Padham Parugulu Song From Maruva Tarama Launched - Sakshi

డిఫరెంట్‌ కంటెంట్‌తో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'మరువ తరమా'. అద్వైత్‌ ధనుంజయ, అతుల్య రవి హీరోహీరోయిన్లుగా నటించారు.చైతన్య వర్మ నడింపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే అనే సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఈ సాంగ్‌ను పాడాడు. ముఖ్యంగా ఈ పాటలో చూపించిన లోకేషన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ సాంగ్‌ కూడా సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుందని మేకర్స్‌ తెలిపారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ వెల్లడిస్తామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement