ఈ సినిమా నాకో పెద్ద వేడుక 

Our village is Polimera 2 movie is released on November 3 - Sakshi

‘సత్యం’ రాజేశ్‌

‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా, రాకేందు మౌళి, బాలాదిత్య, కరుణకుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. 2021లో వీక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఊరి పోలిమేర’కు ఇది సీక్వెల్‌ చిత్రం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చితాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి నేడు విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘సత్యం’ రాజేశ్‌ మాట్లాడుతూ– ‘‘మా ఊరి పోలిమేర’కు వీక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి ‘మా ఊరి పోలిమేర 2’ చేద్దామని అనుకున్నాం. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచే మలి భాగం ఆరంభమవుతుంది.

కొమరయ్య (సినిమాలో ‘సత్యం’ రాజేశ్‌ పాత్ర) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ పాత్ర) ఏం చేసింది? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది? కవిత ఎలా జీవించి ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. నా కెరీర్‌లో ఓ పెద్ద వేడుకలా ఈ సినిమాను భావిస్తున్నాను. ప్రస్తుతం ‘గీతాంజలి’ సీక్వెల్, వరుణ్‌తేజ్‌ ‘మట్కా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. హీరోగా ‘టెనెంట్‌’ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top