Ormax Media Released Popular Actors List In 2023 June - Sakshi
Sakshi News home page

Ormax Media Survey: టాప్‌ వన్‌ హీరో, టాప్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరంటే..?

Jul 25 2023 2:14 PM | Updated on Jul 28 2023 1:14 PM

Ormax Media Released Popular Actors List In 2023 June - Sakshi

వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్‌ పాపులర్‌ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ 'ఓర్మాక్స్‌ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనేది టాప్‌ 10 జాబితాను ప్రకటించింది. ఈ సంస్ధ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. 2023 జూన్ నెలకు సంబంధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఉన్నారు. తర్వాత షారుఖ్‌ ఖాన్‌ ఉన్నారు. మూడో స్థానంలో ప్రభాస్‌ ఉన్నారు.  

(ఇదీ చదవండి: అయ్యో.. ఈ సీన్‌ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్‌ను గెలికిన కంగనా)

అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత నెలతో చూస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ స్థానాలలో నిలిచారు.  తర్వాత అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7)లో ఉన్నారు. గత నెలలో 6వ స్థానంలో ఉన్న  రామ్ చరణ్ ఈసారి 8వ నంబర్‌తోనే సరిపెట్టుకున్నారు. అక్షయ్ కుమార్ (9),  మహేష్ బాబు (10) స్థానంలో ఉన్నారు. పాన్‌ ఇండియా సినిమాలు చేయకుండానే మహేష్‌ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. గత నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్‌కు జూన్‌ నెలలో చోటు దక్కలేదు.

(ఇదీ చదవండి: యాంకర్‌ రష్మీపై వల్గర్‌ కామెంట్‌ చేసిన కమెడియన్‌)

ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. టాప్‌ పొజీషన్‌లో టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ఉన్నారు.  తర్వాత రోండో స్థానంలో అలియా భట్‌ ఉన్నారు. తర్వాత దీపికా పదుకొనే, నయనతార కాజల్ అగర్వాల్‌, త్రిష, కత్రినా కైఫ్, కైరా అద్వానీ, కీర్తి సురేశ్, రష్మిక మందన్నా వరుసుగా టాప్‌ టెన్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement