మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్‌ఎస్ రాజు నిర్మించిన సినిమా ‘ఒక్కడు’. ఈ చిత్రంలో భూమిక హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్‌రాజ్ విలన్‌గా నటించారు. 2003లో విడుదలైన ‘ఒక్కడు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 4కే వెర్షన్‌లో ఈ సినిమా విడుదల కానుంది. రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామకృష్ణ జూన్ 26న రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రదర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒక్కడు’ ప్రతి సంవత్సరం మరింత క్రేజ్ పెంచుకుంటూ, ఇప్పటికే ఎన్నోసార్లు రీ రిలీజ్ అయింది. ఈ నెల 26న 4కే వెర్షన్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీ అందరిలానే (ప్రేక్షకులు, అభిమానులను ఉద్దేశించి) నేను కూడా చూసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’’ అని అన్నారు.


