O Saathiya Trailer: సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా’ | O Saathiya movie trailer released by Ks Rama Rao | Sakshi
Sakshi News home page

O Saathiya Trailer: సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా’

Jun 27 2023 2:08 AM | Updated on Jun 27 2023 3:00 PM

O Saathiya movie trailer released by Ks Rama Rao - Sakshi

ఆర్యన్‌  గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ సాథియా’. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత కేఎస్‌ రామారావు విడుదల చేసి, ‘‘సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు.

‘‘ఆర్యన్‌ గౌర తన గురించి చెప్తుంటే నా తొలి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి’’ అన్నారు డైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు చక్కని చిరునవ్వుతో థియేటర్‌ నుంచి బయటికొస్తారు’’ అన్నారు ఆర్యన్‌ గౌర. ‘‘నా గురువు విజయేంద్ర ప్రసాద్‌ గారివల్లే నేను ఇక్కడ ఉన్నాను. సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’’ అన్నారు దివ్య భావన. ‘‘మా సినిమా చూశాక అందరికీ తమ తొలి ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సుభాష్‌ కట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement