breaking news
Misty chakravarthi
-
O Saathiya Trailer: సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా’
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ సాథియా’. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత కేఎస్ రామారావు విడుదల చేసి, ‘‘సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఆర్యన్ గౌర తన గురించి చెప్తుంటే నా తొలి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి’’ అన్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు చక్కని చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటికొస్తారు’’ అన్నారు ఆర్యన్ గౌర. ‘‘నా గురువు విజయేంద్ర ప్రసాద్ గారివల్లే నేను ఇక్కడ ఉన్నాను. సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’’ అన్నారు దివ్య భావన. ‘‘మా సినిమా చూశాక అందరికీ తమ తొలి ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సుభాష్ కట్టా. -
ఆమెను కాపీ చేయలేదు
‘‘హిందీ ‘హంటర్’లో రాధికా ఆప్టే చేసిన పాత్రను, తెలుగులో నేను చేశా. అడల్ట్ కామెడీ ‘హంటర్’లో మెయిన్ పాయింట్‌ను మిస్ చేయకుండా దర్శకుడు నవీన్ కథలో కొన్ని మార్పులు చేసి, తెలుగులో పూర్తి వినోదాత్మకంగా, విభిన్నంగా తీశారు’’ అన్నారు మిస్తీ చక్రవర్తి. అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘బాబు బాగా బిజీ’లో మిస్తీ ఓ హీరోయిన్. సుప్రియ ఐసోల, తేజస్వి మదివాడ, శ్రీముఖి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజవుతోంది. మిస్తీ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా పేరు రాధ. నటిగా ఏదైనా కొత్తగా ప్రయత్నించే ఛాన్స్ దక్కుతుందని ఈ సినిమా చేశా. రాధికా ఆప్టే నటనను కాపీ చేయకుండా నా స్టైల్లో చేశా. అవసరాల కాంబినేషన్లో నాకు ఎక్కువ సీన్లు ఉన్నాయి. సినిమాలో అతను చేసిన పాత్రకు, నిజజీవితంలో పాత్రకు చాలా తేడా ఉంటుంది. వెరీ గుడ్ కో–స్టార్. అవుట్‌పుట్ కూడా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుందనే నమ్మకముంది. నేను చేస్తున్న మరో తెలుగు సినిమా ‘శరభ’ చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న చిత్రమది’’ అన్నారు.