-
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఓ సాథియా’
అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. జులై 7న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ అవుతుంటున్న మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. ఇప్పటికి 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ తో అన్ స్టాపబుల్ గా నిలించింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ సంపాదించుకుంది. ఓ సాథియా కథేంటంటే.. బీటెక్ చదువుతున్న అర్జున్( ఆర్యన్ గౌర), అదే కాలేజీకి చెందిన కీర్తి (మిస్తీ చక్రవర్తి)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అర్జున్ అంటే నచ్చని మరో స్టూడెంట్ కూడా కీర్తిని ఇష్టపడతాడు. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడుతుంటాడు. అతని టార్చర్ నుంచి బయటపడేందుకు అర్జున్‌తో లవ్ ఉన్నట్లు అబద్దం చెబుతుంది. అలా అర్జున్, కీర్తి బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు కిర్తికి ప్రపోజ్ చేద్దామని ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంటుంది. అసలు కీర్తి ఎక్కడికి వెళ్లింది? ఆమె కోపం పిచ్చొడిలా మారిన అర్జున్ తిరిగి ఎలా సాధారణ స్థితిలోకి వచ్చాడు? కీర్తి హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసి.. ఆమె చదువుకునే కాలేజీలోనే జాయిన్ అయిన అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కీర్తి ప్రేమను పొందడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు అర్జున్ ఏ స్థితిలో కీర్తిని కలుస్తాడు? మళ్లీ కలిసిన తర్వాత వీరు మళ్లీ ప్రేమించుకుంటారా? అసలు వీరిద్దరిలో ఎవరు, ఎవరిని ప్రేమిస్తున్నారు? అనేదే మిగతా కథ. -
‘ఓ సాథియా’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ సాథియా నటీనటులు: ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని తదితరులు నిర్మాణ సంస్థ: తన్విక–జస్విక క్రియేషన్స్ నిర్మాతలు: సుభాశ్ కట్టా, చందన కట్టా దర్శకత్వం:దివ్యభావన సంగీతం: విన్నూ వినోద్ సినిమాటోగ్రఫీ: ఈజే వేణు విడుదల తేది: జులై 7, 2023 కథేంటంటే బీటెక్ చదువుతున్న అర్జున్( ఆర్యన్ గౌర), అదే కాలేజీకి చెందిన కీర్తి (మిస్తీ చక్రవర్తి)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అర్జున్ అంటే నచ్చని మరో స్టూడెంట్ కూడా కీర్తిని ఇష్టపడతాడు. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడుతుంటాడు. అతని టార్చర్ నుంచి బయటపడేందుకు అర్జున్‌తో లవ్ ఉన్నట్లు అబద్దం చెబుతుంది. అలా అర్జున్, కీర్తి బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు కిర్తికి ప్రపోజ్ చేద్దామని ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంటుంది. అసలు కీర్తి ఎక్కడికి వెళ్లింది? ఆమె కోపం పిచ్చొడిలా మారిన అర్జున్ తిరిగి ఎలా సాధారణ స్థితిలోకి వచ్చాడు? కీర్తి హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసి.. ఆమె చదువుకునే కాలేజీలోనే జాయిన్ అయిన అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కీర్తి ప్రేమను పొందడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు అర్జున్ ఏ స్థితిలో కీర్తిని కలుస్తాడు? మళ్లీ కలిసిన తర్వాత వీరు మళ్లీ ప్రేమించుకుంటారా? అసలు వీరిద్దరిలో ఎవరు, ఎవరిని ప్రేమిస్తున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రతి వ్యక్తికి తొలి ప్రేమ అనేది చాలా స్పెషల్. ఆ మధుర జ్ఞాపకాలు హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయి. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి పనులు.. ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు దర్శకురాలు దివ్య భావన. తొలి ప్రేమ అనుభవం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఆసక్తికర సన్నివేశాలతో ఈ మూవీ రూపొందించారు. దర్శకురాలు ఎంచుకున్న ఈ లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదని చెప్పలేం. కానీ సున్నితమైన ప్రేమ కథను చాలా సున్నితంగా చూపించారు. ఫస్టాఫ్ అంతా కాలేజీ ఎపిసోడ్స్‌లో రొటీన్‌గా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి. ఇక . ఇక సెండాఫ్లో కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరి 15 నిమిషాలు అయితే హృదయాలను హత్తుకుంటాయి. అర్జున్, కీర్తిల లవ్స్టోరీలోని ట్విస్ట్ తెలిశాక.. అంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. సినిమాలో ఎక్కువగా కొత్తవాళ్లు ఉండడం ఈ సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేసే యువుడు అర్జున్‌గా ఆర్యన్ గౌర చక్కగా నటించాడు. కొత్తవాడే అయినా ఎక్కడ తడబడలేదు. అయితే అతని డబ్బింగ్ మాత్ర కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇక కీర్తిగా మిస్తీ చక్రవర్తి తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. చైతన్య గరికపాటి కామెడీ బాగా వర్కౌట్ అయింది. దేవీ ప్రసాద్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ,, క్రేజి ఖన్నా, బుల్లెట్ భాస్కర్, అంబరీష్ అప్పాజి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. విన్నూ వినోద్ సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా, హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. బీజీఎం పర్వాలేదు. డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ పనీతీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
O Saathiya: ఫస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నాం
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన లవ్‌స్టోరీ ‘ఓ సాథియా’. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించారు. యూఎఫ్ఓ మూవీస్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేయనుంది. ‘‘లవ్‌స్టోరీలో ఓ డిఫరెంట్ యాంగిల్‌ను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రతి వ్యక్తి జీవితంలో మెమొరబుల్‌గా నిలిచే ఫస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
O Saathiya Trailer: సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా’
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ సాథియా’. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత కేఎస్ రామారావు విడుదల చేసి, ‘‘సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఆర్యన్ గౌర తన గురించి చెప్తుంటే నా తొలి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి’’ అన్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు చక్కని చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటికొస్తారు’’ అన్నారు ఆర్యన్ గౌర. ‘‘నా గురువు విజయేంద్ర ప్రసాద్ గారివల్లే నేను ఇక్కడ ఉన్నాను. సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’’ అన్నారు దివ్య భావన. ‘‘మా సినిమా చూశాక అందరికీ తమ తొలి ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సుభాష్ కట్టా. -
పాన్ ఇండియా స్థాయిలో ‘ఓ సాథియా’
ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఓ సాథియా’. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్ ఇండియా లెవెల్లో భారీగా విడుదల కాబోతోంది. (చదవండి: మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?) ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్అప్తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం యూఎఫ్ఓ( UFO) మూవీస్ సంస్థ ఏపీ, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జి.లక్ష్మణ్ అని చెప్పారు. ఈ సినిమా కి పాటలు బ్యాక్ బోన్ అని, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చినట్లు నిర్మాత సుభాష్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement