పాన్‌ ఇండియా స్థాయిలో ‘ఓ సాథియా’ | O Saathiya Movie Release Date Out | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా స్థాయిలో ‘ఓ సాథియా’

Jun 22 2023 5:04 PM | Updated on Jun 22 2023 5:04 PM

O Saathiya Movie Release Date Out - Sakshi

ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన  ప్రేమకథా చిత్రం ‘ఓ సాథియా’.  ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.

(చదవండి: మెగా ప్రిన్సెస్‌ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?)

ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత  నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం యూఎఫ్‌ఓ( UFO) మూవీస్ సంస్థ ఏపీ, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌  జి.లక్ష్మణ్‌ అని చెప్పారు. ఈ సినిమా కి పాటలు బ్యాక్ బోన్ అని, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చినట్లు నిర్మాత సుభాష్ చెప్పారు.    

Advertisement
 
Advertisement
Advertisement