ముక్కోణపు ప్రేమకథ | Nikhil Siddharth Appudo Ippudo Epudo Teaser Released | Sakshi
Sakshi News home page

ముక్కోణపు ప్రేమకథ

Oct 12 2024 3:08 AM | Updated on Oct 12 2024 3:08 AM

Nikhil Siddharth Appudo Ippudo Epudo Teaser Released

నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. దివ్యాంశా కౌశిక్‌ కీలకపాత్రలో, హర్ష చెముడు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 8న విడుదల కానుంది. 

కాగా దసరా పండగని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రిషి అనేపాత్రలో నిఖిల్‌ కనిపించనున్నారు. యాక్షన్‌ ఎలిమెంట్, చేజింగ్‌ సన్నివేశాలు, కథలోని కొన్ని కీలక మలుపులతో టీజర్‌ని విడుదల చేశాం. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి వినోదం, రొమాన్స్‌ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. ‘స్వామి రారా, కేశవ’ వంటి చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్‌ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement