సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో) | Niharika Konidela Graces Launch of ‘Iruvuri Bhamala Kougililo’ Under K. Raghavendra Rao | Sakshi
Sakshi News home page

సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)

Nov 11 2025 12:50 PM | Updated on Nov 11 2025 12:57 PM

Niharika Konidela and raghavendra rao in iruvuri bhamala kougililo movie event

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఇరువురి భామల కౌగిలిలో’. తాజాగా ఈ మూవీ  ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్‌లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా డాటర్‌ నిహారిక సందడిగా కనిపించారు. ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక తన మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’తో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుంది. దీంతో నిహారిక తన రెండో ప్రాజెక్ట్‌ను సంగీత్ శోభన్, నయన్ సారికతో చేస్తోంది. తను నిర్మాతగా మాత్రమే కాదు.. సోషల్‌మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు.  ఏదేమైనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు నిర్మాతగా సత్తా చాటుతున్నారు.

‘ఇరువురి భామల కౌగిలిలో’ సినిమా పూజా కార్యక్రమంలో నిహారిక సందడిగా కనిపించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో  ఆమె సరదాగా మాట్లుడుతున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు ఆమె కామెంట్స్‌ను ఆఫ్‌ చేయడం విశేషం.

‘ఇరువురి భామల కౌగిలిలో’ సినిమా విషయానికొస్తే.. త్రినాథ్‌వర్మ, వైష్ణవి కొల్లూరు, మలినా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి అచ్యుత్‌ చౌదరి దర్శకుడు కాగా.. శ్రీనివాసగౌడ్‌ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక కొణిదెల క్లాప్‌ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ చిత్రం త్వరలో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement