Netizens Angry Over Venkatesh Daggubati Rana Naidu Web Series, Know Reasons Inside - Sakshi
Sakshi News home page

Rana Naidu Web Series: ఎవర్రా మీరంతా? బూతులు సరే కథ ఎక్కడ? మండిపడుతున్న నెటిజన్లు

Mar 11 2023 7:12 PM | Updated on Mar 11 2023 7:49 PM

Netizens Angry Over Venkatesh Daggubati Rana Naidu Web Series - Sakshi

వెంకటేశ్‌ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్‌ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను

టాలీవుడ్‌ హీరోల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తి వెంకటేశ్‌. ఆయన సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. కానీ తొలిసారి అలాంటి పాత్రలకు చెక్‌ పెడుతూ రానా నాయుడులో కొత్త రోల్‌లో కనిపించాడు వెంకీ. ఈ సిరీస్‌లో నాగ నాయుడిగా తండ్రి పాత్రలో నటించాడు. సుందర్‌ ఆరోన్‌, లోకోమోటివ్‌ గ్లోబల్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దయచేసి కుటుంబంతో కలిసి చూడొద్దని మొదటి నుంచి యూనిట్‌ అంతా మొత్తుకుంటోంది. వాళ్లెందుకు అలా చెప్తున్నారో ఒక్క ఎపిసోడ్‌ చూసినా అర్థమైపోతుంది.

డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, బూతులతో నిండిపోయిందీ సిరీస్‌. వెంకటేశ్‌ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్‌ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్‌ ఆడియన్స్‌ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. బూతులు తప్ప కథ లేదని మండిపడుతున్నారు. ఎంతో ఎక్స్‌పెక్ట్‌ చేశాం, కానీ డిజాస్టర్‌ అవడం ఖాయం అని రివ్యూలు ఇస్తున్నారు.

మరికొందరు మాత్రం.. ఇన్నిరోజులు కుటుంబ విలువల గురించి చెప్పారు కదా, ఎంతమంది నిజజీవితంలో పాటించారు? మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే మానేయండి. కానీ నటులు ఎలాంటి పాత్రలు పోషించాలనేది కూడా మీరే నిర్ణయిస్తారా? అని వెనకేసుకొస్తున్నారు. ఊరికే తిడుతున్నారు కానీ సిరీస్‌ మాత్రం కిరాక్‌గా ఉంది అని పొగుడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement