ఈమెని గుర్తుపట్టారా? హీరోయిన్‌గా తెలుగులో ఒకే సినిమా! | Neninthe Movie Actress Siya Gautam Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈమెకి టాలీవుడ్‌లో అస్సలు కలిసి రాలేదు!

Sep 8 2023 9:03 PM | Updated on Sep 9 2023 9:25 AM

Neninthe Movie Herione Siya Gautam Details - Sakshi

ఈ బ్యూటీ ముంబయిలో పుట్టి పెరిగింది. మోడలింగ్ చేస్తూ ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. అలా తెలుగులో ఓ స్టార్ డైరెక్టర్ దృష్టిలో పడింది. ఏకంగా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ బాగానే ఉన్నప్పటికీ.. థియేటర్లలో సరిగా ఆడలేదు. హీరోయిన్‌గా ఈమెకు మరో ఛాన్స్ రాలేదు. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శియ గౌతమ్. అవును మీలో కొందరు అనుకున్నది నిజమే. రవితేజ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే చాలామంది ఇడియట్ అని చెబుతారేమో. దాని కంటే 'నేనింతే' ఇంకా బాగుంటుంది. ఇందులోనే శియ హీరోయిన్‌గా నటించి, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో)

కానీ ఈమెకు అదృష్టం కలిసిరాలేదు. ఈ సినిమాతో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్‌గా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దీంతో వేదం, పక్కా కమర్షియల్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోవడమే మానేశారు. 

ఇకపోతే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమె.. మికైల్ పాల్కివాలా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఫ‍్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాస్త గ్లామర్ డోస్ ఉండే ఫొటోల్ని పోస్ట్ చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తోంది. ఇంత అందంగా ఉన్నాసరే ఈమెకు పెద్దగా ఛాన్సులు రాకపోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement