ఆ స్టార్ డైరెక్టర్‌ సినిమాలో లేడీ సూపర్‌ స్టార్! | Nayanthara Will Act In Lokesh Kanagaraj's Upcoming Movie - Sakshi
Sakshi News home page

Nayanthara: స్టార్ డైరెక్టర్‌ సినిమాలో నయన్.. హీరో ఎవరంటే!

Published Mon, Sep 4 2023 8:13 AM

Nayanthara Will Acts in Lokesh Kanagaraj Upcoming Movie - Sakshi

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేమ వ్యవహారం, పెళ్లి, పిల్లలు ఇలా అన్ని విషయాల్లోనూ తాను సంచలనమే. వయసు నాలుగు పదుల దగ్గర్లో ఉన్నా.. హీరోయిన్‌గా 75 చిత్రాల మైల్‌ స్టోన్‌ టచ్‌ చేసింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయన్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: ఆ ఇద్దరు కాదు.. స్టార్‌ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!)

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ డైరెక్షన్‌లో నయన్ నటించబోతున్నారన్నదే లేటెస్ట్ టాక్. తొలి చిత్రం మా నగరం నుంచి ఈ మధ్య విడుదలైన విక్రమ్‌ వరకు అపజయం అనేది ఎరుగకుండా సక్సెస్‌ ఫుల్‌ ప్రయాణం చేస్తున్న దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌. ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటిస్తున్న లియో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా తదుపరి లోకేష్‌ కనకరాజు కోసం చాలా చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. అందులో కమలహాసన్‌ నటించిన విక్రమ్‌ 2, కార్తీ హీరోగా ఖైదీ 2 వంటి భారీచిత్రాలు ఉన్నాయి. 

అలాంటిది అనూహ్యంగా నయనతార హీరోయిన్‌గా మరో చిత్రం గురించి వార్త వెలుగులోకి వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఇందులో నటుడు లారెన్స్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

(ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)

Advertisement
Advertisement